Coolie, War 2: కూలీ, వార్ 2..నాలుగు రోజుల కలెక్షన్లు ఎన్ని కోట్లంటే.?
నాలుగు రోజుల కలెక్షన్లు ఎన్ని కోట్లంటే.?

Coolie, War 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఈ రెండు చిత్రాలు నాలుగు రోజుల్లోనే భారీ కలెక్షన్లను సాధించాయి.
కూలీ
మొదటి 4 రోజుల్లో కూలీ సినిమా ఇండియాలో రూ.193.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 375 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా మొదటి వారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది ఇంతకు ముందు ఉన్న లియో (రూ.370 కోట్లు) రికార్డును అధిగమించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది.
వార్ 2
వార్ 2 సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియాలో రూ. 173.60 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 275.74 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూలీకి గట్టి పోటీ ఇస్తోంది. తొలి రోజు కూలీ వెనుకబడి ఉన్నప్పటికీ, రెండో రోజు కలెక్షన్లలో వార్ 2 ముందుకు దూసుకెళ్లింది. ప్రస్తుతానికి వసూళ్లలో కూలీ సినిమా వార్ 2 కంటే ముందంజలో ఉంది. ఈ రెండు చిత్రాలు కూడా రాబోయే రోజుల్లో నెట్ వసూళ్లలో రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.
