క్రేజీ అప్ డేట్

New Update from Pawan’s Ustaad: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని మొదటి పాట (ఫస్ట్ సింగిల్) ప్రోమో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. రేపు సాయంత్రం 6.30గంటలకు ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేస్తున్నట్లు టీం ప్రకటించింది. ఇందులో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ మూవ్స్ ఈలలు వేసేలా ఉంటాయని, అదిరిపోయే ఎనర్జీతో ఆయన కనిపించనున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ సాంగ్ కంపోజ్ చేయగా, భాస్కరభట్ల లిరిక్స్ అందించారని, విశాల్ దడ్లాని ఈ పాటను పాడినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌‌లో ఇంప్రెస్ చేశారు. ఈ పాటకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రోమోతో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం!

దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ (నవీన్ యెర్నేని, వై. రవిశంకర్) నిర్మిస్తోంది. శ్రీలీల , రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు

పవన్ కళ్యాణ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ముఖ్యంగా హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story