వినాయక చవితికి రెండో సాంగ్

Crazy Update from OG: ఓజీ' (OG) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 'సాహో' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా నుంచి వినాయక చవితి సందర్భంగా 'ఓజీ' (OG) చిత్రం నుంచి రెండో పాట విడుదల కానుంది. ఆగస్టు 27న ఉదయం 10:08 నిమిషాలకు సువ్వీ సువ్వీ అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

థమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీలో ఇప్పటికే విడుదలైన 'ఫైర్‌స్టార్మ్' పాట ఒక యాక్షన్ థీమ్‌తో ఉన్నప్పటికీ, ఈ 'సువ్వీ సువ్వీ' పాట మెలోడీ, రొమాంటిక్ పాటగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ ఉన్న రొమాంటిక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.వినాయక చవితి పండుగకు ఈ పాట అభిమానులకు ఒక ప్రత్యేక బహుమతిగా ఉంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ఈ పాట తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఓజీ' ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ముంబై నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన పదేళ్ల తర్వాత ముంబైకి తిరిగి వచ్చి, అక్కడి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే ఒక నేరస్థుడిని అంతం చేయాలనుకుంటాడు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ కొత్త లుక్, థమన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story