క్రేజీ అప్‌డేట్

‘The India Story’: చందమామ కాజల్ అగర్వాల్ అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్! కమర్షియల్ సినిమాలతోనే కాకుండా.. కంటెంట్ ఉన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అలరిస్తున్న కాజల్, ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీతో మన ముందుకు రాబోతోంది. ఆమె ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న లేటెస్ట్ కోర్ట్‌రూమ్ డ్రామా.. ‘ది ఇండియా స్టోరీ’.
ప్రస్తుత సమాజంలో మనకు తెలియకుండానే మన ప్రాణాలను హరిస్తున్న ఒక పెద్ద సమస్యను ఈ సినిమాలో చూపించబోతున్నారు. పురుగుమందుల వ్యవసాయం వల్ల సాధారణ ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రమాదకరమైన ప్రభావాలు పడుతున్నాయి అనే వినూత్నమైన, ఆలోచింపజేసే ప్రధానాంశంతో దర్శకుడు చేతన్ డీకే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ ప్రజల పక్షాన పోరాడే ఒక పవర్‌ఫుల్, ఇంటెన్స్ లాయర్ పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలను రేకెత్తించాయి.
తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సస్పెన్స్ కోర్ట్‌రూమ్ డ్రామాను జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అంతేకాదు, త్వరలోనే ఈ సినిమా పవర్‌ఫుల్ టీజర్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. రాబోయే టీజర్ ప్రేక్షకులను ‘ది ఇండియా స్టోరీ’ ప్రపంచంలోకి మరింతగా తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్ఫడే ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బి షిండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగేష్ ధక్డే ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.మరి లాయర్ కోటు వేసుకుని సమాజంలోని ఒక పెద్ద సమస్యపై కాజల్ అగర్వాల్ చేయబోయే ఈ కోర్టు పోరాటం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి!

