జోనితాతో అడివి శేష్ మాస్ స్టెప్పులు!

Dacoit Crazy Update: అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం "డెకాయిట్" (Decoit). ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'రుబారు' సాంగ్ మెలోడీ ప్రియులను అలరించగా, ఇప్పుడు సెకండ్ సింగిల్‌తో మాస్ స్టెప్పులు వేయించేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ పాటలో అడివి శేష్ ఎప్పుడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతుండటం విశేషం.

వచ్చే మార్చి 28న విడుదల కానున్న "చిచ్చుబుడ్డి" సాంగ్ గురించి అడివి శేష్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పాటను పాపులర్ సింగర్ జోనితా గాంధీ, రామ్ మిరియాల కలిసి పాడారు. అయితే ఈ పాటలో జోనితా కేవలం తన గొంతును అందించడమే కాకుండా, అడివి శేష్‌తో కలిసి స్క్రీన్ పైన అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు కూడా వేశారని ఆయన తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, షానీల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. అడివి శేష్ మాస్ డ్యాన్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story