Dacoit Promotion: డెకాయిట్ ప్రమోషన్.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అడివి శేష్
భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అడివి శేష్

Dacoit Promotion: వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న యంగ్ హీరో అడివి శేష్.. ఇప్పుడు డెకాయిట్ అనే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్‌లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల హోరును పెంచింది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ అడివి శేష్, చిత్ర యూనిట్ వరంగల్‌లోని చారిత్రాత్మక భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శేష్ మాట్లాడుతూ.. "ఈ కథ రాసినప్పటి నుండి నేను ఇందులో భాగస్వామిని అయ్యాను. ప్రేక్షకులకు ఈ అద్భుతమైన కథను పరిచయం చేసే ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉంది" అని తెలిపారు.
హృదయాలను హత్తుకునే రుబరూ సాంగ్ విడుదల
ప్రమోషన్లలో భాగంగా చిత్రంలోని మొదటి సాంగ్ రుబరూను విడుదల చేశారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య సాగే ఈ రొమాంటిక్ మెలోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట సినిమాలోని ప్రధాన భావోద్వేగాలను, ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ఉన్న కెమిస్ట్రీని చక్కగా ఆవిష్కరించింది. షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతోంది.
తనను మోసం చేసిన మాజీ ప్రియురాలిపై ఒక ఖైదీ తీర్చుకునే ప్రతీకారమే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తుండటం విశేషం. ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి వంటి ఉద్దండులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

