✕
Tom Shine Chako:దసరా విలన్ కారుకు యాక్సిడెంట్.. స్పాట్ లోనే తండ్రి..
By PolitEnt MediaPublished on
కారు యాక్సిడెంట్.. స్పాట్ లోనే తండ్రి..

x
Tom Shine Chako: నటుడు షైన్ టామ్ చాకో వాహనం ప్రమాదానికి గురైంది. షైన్ తండ్రి, సి.పి. చాకో ప్రమాదంలో మరణించాడు. షైన్ తో పాటు అతని తల్లి, సోదరుడు గాయపడ్డారు. ఈ ఉదయం సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. షైన్ తన ఫ్యామిలీతో ఎర్నాకుళం నుండి బెంగళూరు వెళ్తున్నాడు. కారు అతివేగంతో ముందున్న లారీని ఢీకొట్టింది. షైన్ చేతులకు బలమైన గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
షైన్ టామ్ చాకోకు కష్టసమయాల్లో తండ్రి సీపీ అండగా నిలిచారు. డ్రగ్స్ బారిన పడిన కొడుకును తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సీపీ చాకో ఎంతో ప్రయత్నించాడు. ఇప్పటికే తండ్రీకొడుకులు కలిసి ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ లో చాలా సినిమాలు తీయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ తండ్రి మరణం షైన్ కు ఊహించని పెను విషాదాన్ని మిగిల్చింది.
Next Story

