Bhagya Sri Gives Clarity: రామ్ తో డేటింగ్..క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ
క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ

Bhagya Sri Gives Clarity: నటి భాగ్యశ్రీ బోర్సే, యంగ్ హీరో రామ్ పోతినేనితో డేటింగ్, సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ వంటి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం మహేష్ బాబు.పి దర్శకత్వంలో వస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ షూటింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉందని పుకార్లు వచ్చాయి. లేటెస్ట్ గా డేటింగ్ పుకార్లపై భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ, రామ్ పోతినేని తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేశారు. అతని నటనకు, కష్టపడే తత్వానికి తాను పెద్ద అభిమానినని ఆమె తెలిపారు.
ఆమె చేతికి ఉన్న ఉంగరం గురించి నెటిజన్లు ప్రశ్నించినప్పుడు, రామ్ ఆమెకు ఉంగరం తొడిగారనే ప్రచారం జరిగింది. దీనికి ఆమె స్పందిస్తూ, "ఆ ఉంగరం నాకు ఎవరూ తొడగలేదు, నేనే కొనుక్కున్నాను" అని బదులిచ్చారు. దీంతో సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ వార్తల్లో ఎటువంటి నిజం లేదని పరోక్షంగా తేలిపోయింది. మరోవైపు, రామ్ పోతినేని కూడా ఈ రూమర్లపై స్పందించారు. ఈ సినిమా కోసం తాను రాసిన ఒక ప్రేమ గీతం నుంచే ఈ పుకార్లు మొదలయ్యాయని, అయితే ఆ పాటను పాత్రల కోసం మాత్రమే రాశానని, ఆ పాట రాసే నాటికి హీరోయిన్ ఎంపిక జరగలేదని వివరించారు.
వీళ్లిద్దరు కలిసి నటించిన ఆంధ్రాకింగ్ తాలూకా రేపు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.కన్నడ నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. రామ్, భాగ్యశ్రీల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరిందో సినిమా విడుదలైతే తెలుస్తుంది.

