రెడ్డిగా మనోజ్

David Reddy Movie: మంచు మనోజ్‌ ఇండస్ట్రీలోకి వచ్చి 21 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా కొత్త సినిమాను అనౌన్స్‌ చేశాడు. దీనికి ‘డేవిడ్‌ రెడ్డి’ అనే టైటిల్‌ పెట్టినట్లు ప్రకటిస్తూ.. పోస్టర్‌ని విడుదల చేశారు.హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో వస్తోన్న ఒక చారిత్రక యాక్షన్ డ్రామా.

1897 నుంచి 1922 మధ్య కాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం.మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు, ఢిల్లీలో పెరిగాడు. ఇప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

చాలా కాలం తర్వాత మనోజ్ ఇటీవల భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. .చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించారు మనోజ్. హీరోగా ఆయన మొదటి సినిమా 2004లో విడుదలైన దొంగ దొంగది. తన 21 ఏళ్ల కెరీర్ లో మనోజ్ బిందాస్ (2010)లో నటనకు గాను ఆయనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది.వేదం, పోటుగాడు, కరెంట్ తీగ, మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? వంటి పలు హిట్ సినిమాలు ఉన్నాయి. త్వరలో ఆయన మిరాయ్, వాట్ ది ఫిష్ వంటి చిత్రాల్లో కూడా కనిపించనున్నారు మనోజ్.

Updated On 5 Dec 2025 1:10 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story