Mahesh Babu Praises: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం డీసీ . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వినూత్న కాన్సెప్ట్‌తో విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు డీసీ చిత్రాన్ని వీక్షించి చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సోషల్ మీడియా వేదికగా సినిమాపై తన స్పందనను పంచుకుంటూ.. "డీసీ ఒక అద్భుతమైన, సరికొత్త ప్రయోగం. సినిమా నాకు ఎంతగానో నచ్చింది, ప్రతి ఒక్క అంశం ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం శ్రమించిన చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు" అని మహేశ్ పేర్కొన్నారు.

మహేశ్ బాబు చేసిన ఈ పోస్ట్‌పై దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. సూపర్ స్టార్ నుంచి ఇలాంటి ప్రశంస రావడం ఎంతో ఆనందాన్ని, ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని ఎమోషనల్ అయ్యారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడిగా గుర్తింపు పొందిన లోకేశ్ కనగరాజ్, గతంలో కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు. అయితే డీసీ ద్వారా పూర్తిస్థాయి కథానాయకుడిగా మారి మెప్పించడం విశేషం.వైవిధ్యమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకపోతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story