Deepika and Ranveer: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తమ కూతురు దువాతో కలిసి దిగిన కొన్ని అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫొటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో దీపికా, రణ్‌వీర్‌తో పాటు వారి కూతురు దువా కూడా కనిపించింది. దీపికా బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుండగా.. రణ్‌వీర్, దీపికా తమ కూతురితో ఆప్యాయంగా గడుపుతున్న క్షణాలు ఈ ఫొటోల్లో కనిపిస్తున్నాయి.

ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బేబీ దువా, మా హృదయాలు మరింత పెద్దవవుతున్నాయి! మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అంటూ దీపికా, రణ్‌వీర్ రాసుకొచ్చారు. దీపికా, రణ్‌వీర్ దంపతులకు 2024 సెప్టెంబర్‌లో దువా జన్మించింది. ఇప్పుడు వీరిద్దరూ తమ రెండో బిడ్డకు త్వరలో స్వాగతం పలకబోతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. దీపికా పదుకొణె ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న రాకా , షారుక్ ఖాన్ నటిస్తున్న కింగ్ సినిమాల్లో కనిపించనున్నారు. మరోవైపు రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం ప్రళయ్ సినిమాలో నటిస్తున్నారు.

Next Story