Deepika Padukone: భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె
తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

Deepika Padukone: ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను భారతదేశపు మొట్టమొదటి మెంటల్ హెల్త్ అంబాసిడర్ (మానసిక ఆరోగ్య రాయబారి)గా నియమించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (World Mental Health Day - అక్టోబర్ 10) సందర్భంగా ప్రకటించింది
దీపికా పదుకొణె గతంలో తను డిప్రెషన్‌తో పోరాడిన అనుభవాన్ని ధైర్యంగా పంచుకోవడం, అలాగే ఆమె స్థాపించిన 'ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్' (The Live Love Laugh Foundation - TLLLF) ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో ఆమె చురుకైన పాత్ర పోషించడం దీనికి ప్రధాన కారణం.
ఆమె ఈ బాధ్యతలో భాగంగా దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, మానసిక సమస్యలపై ఉన్న అపోహలను తొలగించడం (De-stigmatization), సహాయం కోరడాన్ని ప్రోత్సహించడం, కేంద్ర ప్రభుత్వ టెలీ-మానస్ (Tele-MANAS) వంటి కార్యక్రమాలను ప్రచారం చేయడంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు.
ఈ నియామకం భారతదేశంలో మానసిక ఆరోగ్యాన్ని బహిరంగంగా చర్చించడానికి , ప్రజలకు మద్దతు వ్యవస్థను బలోపేతం చేయడానికి ముందడుగు అని చెప్పవచ్చు.
