Sun Pictures: ఐకాన్ స్టార్ సరసన దీపికా పదుకొణె
అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకొణె

Sun Pictures:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో కొత్త మూవీ తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్ డేట్ ప్రకటించింది మూవీ టీం. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నటిస్తున్నట్లు ప్రకటించింది. అల్లు అర్జున్ కు జోడీగా దీపిక నటించడం ఇదే తొలిసారి.
ది ఫేస్ ఆఫ్ AA22xA6 పేరుతో రిలీజ్ చేసిన దీపికా పదుకొణె స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది. "విజయం దిశగా వెళ్తున్న మహారాణి. దీపికా పదుకొణెకు స్వాగతం" అంటూ మేకింగ్ వీడియో ద్వారా మేకర్స్ వెల్లడించారు. డైరెక్టర్ దీపికకు సీన్స్ వివరిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్నమైన పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి బన్నీ యోధుడి పాత్రలో కనిపించనున్నాడనే వార్తా ఎప్పట్నుంచో వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు యోధురాలిగా, సూపర్ ఉమెన్‌గా దీపికా పదుకొణె కత్తి పట్టి యాక్షన్ చేసే కొన్ని సీన్స్, ఫోటోలు వీడియోలో చూపించారు. దాంతో అల్లు అర్జున్ యోధుడి పాత్ర గురించి క్లారిటీ వచ్చేసింది
