కమల్ తగ్గట్లేదు

Kamal Haasan: కమల్ హాసన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.కన్నడిగులకు సారీ చెప్పేది లేదని తెగేసి చెబుతున్నాడు. కమల్​ హాసన్‌‌పై తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందనే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యల్లో దురుద్దేశ లేదన్నాడు. తన తాజా సినిమా ‘థగ్ లైఫ్’ను కర్నాటకలో విడుదల చేయబోవడం లేదని తెలిపారు. ఈ విషయంపై కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌‌సీసీ)తో చర్చలు జరుపుతానని వెల్లడించారు. కమల్ హాసన్ క్షమాపణ చెబితే వివాదం సమసిపోతుందని కర్నాటక హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కమల్ ​హాసన్ తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై కర్నాటకలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కమల్ ​హాసన్ క్షమాపణ చెప్పకపోతే ‘థగ్ లైఫ్’ సినిమాను కర్నాటకలో విడుదల చేయడానికి అనుమతించబోమని కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(కేఎఫ్‌‌సీసీ) హెచ్చరించింది. అలాగే, ఈ సినిమాను కర్నాటకలో నిషేధించాలని కోరుతూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం ఈ పిటిషన్‌‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కమల్​ హాసన్‌‌పై ఫైర్ అయింది. “మీరు కమల్​హాసన్ అయినా, ఎవరైనా సరే, ప్రజల మనోభావాలను గాయపరిచే హక్కు మీకు లేదు. ఈ దేశంలో చాలా రాష్ట్రాలు భాషల ఆధారంగా ఏర్పడ్డాయి. ఒక భాష మరో భాష నుంచి పుట్టిందని ఎలా చెప్పగలరు? మీరేమైనా చరిత్రకారులా, భాషాశాస్త్రవేత్తలా?” అని జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story