దేవర 2 షూటింగ్

Devara 2: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జా కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే ‘దేవర'. సైఫలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో నటించారు. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చి రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.
అయితే ఈ చిత్రానికి సీక్వెల్ 'దేవర' 2 అసలు ఉందా లేదా అంటూ ఎన్నెన్నో రూమర్స్ వినిపి స్తూ వచ్చాయి. కానీ ఫైనల్ గా వాటి అన్నిటికి ఇప్పుడు ఒక పెద్ద చెక్ మేట్ పడింది. తాజాగా చిత్ర నిర్మాత మిక్కిలినేని సుధాకర్ అప్డేట్ ఇచ్చాడు. 'దేవర 2 షూటింగ్ మే 2026లో ప్రారంభమవుతుంది. అలాగే ఈ సినిమాను 2027లో థియేటర్లలో విడుదల చేస్తం' అని పేర్కొన్నాడు. దీంతోఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.
పార్ట్ 1 లో వదిలేసిన క్లైమాక్స్ ట్విస్ట్‌లు, దేవర,వర పాత్రల మధ్య ఘర్షణ, అలాగే సైఫ్ అలీ ఖాన్ (భైరా) ప్రతీకారం వంటి అంశాలు పార్ట్ 2 లో కీలకం కానున్నాయి. మొదటి భాగం సాధించిన వసూళ్లను దృష్టిలో పెట్టుకుని, రెండో భాగాన్ని మరిన్ని భారీ విజువల్ ఎఫెక్ట్స్,యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందించాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పార్ట్ 2 స్క్రిప్ట్‌పై కసరత్తులు పూర్తి చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ డేట్స్ ఖరారు కాగానే మే నెలలో లేదా ఆ తర్వాత వెంటనే షూటింగ్ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ "వార్ 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "NTR 31" సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టుల ప్రాథమిక పనులు పూర్తయిన తర్వాతే దేవర 2 సెట్స్ మీదకు వెళ్తుంది.

