ఫొటోస్ వైరల్..

Dhanush and Mrunal Spotted Together: సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ విడాకుల తర్వాత తమ జీవితాల్లో బిజీగా ఉన్నారు. ధనుష్ ఇప్పుడు నటి మృణాల్ ఠాకూర్ తో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇద్దరూ చాలా కార్యక్రమాల్లో కలిసి కనిపించడమే దీనికి కారణం. ధనుష్ ఇటీవల మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. ఆ పార్టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ధనుష్ మృణాల్ ఠాకూర్ చేయి పట్టుకుని మాట్లాడుతున్నాడు. వీడియో చూసిన తర్వాత.. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జూలై 3న ఒక పార్టీలో మృణాల్ ఠాకూర్ కనిపించారు. ఆగస్టు 1న జరిగిన మృణాల్ పుట్టినరోజు వేడుకలో కూడా ధనుష్ పాల్గొన్నాడు. మృణాల్ ఠాకూర్ గతంలో పలువురు హీరోలతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. సిద్ధాంత్ చతుర్వేది, కుశాల్ టాండన్, అరిజిత్ తనేజా, శరద్ త్రిపాఠి వంటి వారితో మృణాల్ డేటింగ్ గాసిప్స్ వినిపించాయి. ధనుష్ గురించి చెప్పాలంటే.. అతను నటుడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకుని 18 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. ధనుష్ - ఐశ్వర్య 2022లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ధనుష్ ఇప్పుడు కృతి సనన్ 'తేరే ఇష్క్ మే' మూవీలో నటిస్తున్నాడు. చిత్రం నవంబర్ 28న విడుదల అవుతుంది. మృణాల్ ఠాకూర్ 'సన్ ఆఫ్ సర్దార్ 2' విడుదలైంది. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవ్వగా.. డేటింగ్ ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story