Actor Dharmendra: ఆస్పత్రి నుంచి ధర్మేంద్ర డిశ్చార్జ్
ధర్మేంద్ర డిశ్చార్జ్

Actor Dharmendra: బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వయస్సు సంబంధిత ,శ్వాసకోశ సమస్యల కారణంగా ఆయన మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఇవాళ (నవంబర్ 12)ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఇకపై ఇంట్లోనే చికిత్స కొనసాగుతుందని ఆయనకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.
గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు (మరణ వార్తలు సహా) ప్రచారంలో ఉన్నప్పటికీ, ఆయన కుమార్తె ఈషా డియోల్, భార్య హేమ మాలిని ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు.
ధర్మేంద్ర చనిపోయాడని నిన్న మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలపై గోవింద భార్య హేమమాలిని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ధర్మేంద్ర ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయనకు చికిత్స జరుగుతోందని, ఆయన క్షేమంగా కోలుకోవాలని ప్రార్థించమని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ పుకార్లు వ్యాప్తి చేయడం క్షమించరానిది, అగౌరవమైనది అని కూడా ఆమె అన్నారు.

