Esha Deol: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉంది, తప్పుడు వార్తలు ఆపండి – ఈషా డియోల్
తప్పుడు వార్తలు ఆపండి – ఈషా డియోల్

Esha Deol: బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర అనారోగ్యంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారనే వార్తలతో పాటు, సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం విషమించిందంటూ తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆయన కుమార్తె ఈషా డియోల్ వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈషా డియోల్ మీడియా, నెటిజన్లను ఉద్దేశించి గట్టి హెచ్చరిక చేశారు. "మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోంది. దయచేసి ఇటువంటి అసత్యాలను ప్రచారం చేయవద్దు. మా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు," అని ఆమె పేర్కొన్నారు. ఈ సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని కూడా ఆమె కోరారు. 89 ఏళ్ల ధర్మేంద్ర శ్వాస సంబంధిత సమస్యలతో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన భార్య, నటి-రాజకీయ నాయకురాలు హేమా మాలిని, కుమారుడు సన్నీ డియోల్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తప్పుడు వార్తలకు చెక్ పెడుతూ ఈషా డియోల్ ఇచ్చిన ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఉన్న ధర్మేంద్ర అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

