Dhurandar Revenge: యాక్షన్ సీన్స్ తో దుమ్మురేపిన.. ధురందర్ రివేంజ్
ధురందర్ రివేంజ్

Dhurandar Revenge: రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ చిత్రం.. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై పదమూడు వందల కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రివేంజ్’ వస్తోంది. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఇది నూతన భారతదేశం.. సరిహద్దులు దాటి చొరబడుతుంది.. దెబ్బ కొట్టి తీరుతుంది’’ అనే డైలాగ్‌తో యాక్షన్ సీన్స్‌పై కట్ చేసిన టీజర్ సీక్వెల్‌పై అంచనాలను పెంచుతోంది.
ఫస్ట్ పార్ట్ హిందీలో మాత్రమే విడుదలవగా ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. మార్చి 19న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగల సెలవులు కలిసొచ్చే అంశం. ఇక ప్రస్తుతం ‘ధురంధర్’ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సీక్వెల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం జియో హాట్ స్టార్ చేజిక్కించుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో అక్షయ్ ఖన్నా పాత్ర చనిపోగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, మాధవన్, రాకేష్ బేడీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మిస్తున్నారు.

