‘Dhurandhar 2’ : థియేటర్లలో రూ.1,850 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాసిన ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాక్‌బస్టర్ 'ధురంధర్'2 ఇక మీ స్క్రీన్స్‌పైకి వచ్చేస్తోంది. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్‌గా నిలిచిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన విధానానికి దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సెన్సేషన్ డిజిటల్ వరల్డ్‌లో కూడా రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమైంది.

కరాచీ అండర్‌వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో, గూస్‌బంప్స్ తెప్పించే మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో సాగే ఈ సినిమా.. ఈరోజు, అంటే జూన్ 4 రాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar) లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, మళ్లీ మళ్లీ చూడాలనుకునే వాళ్లు ఈ రాత్రి నుంచి తమ హోమ్ థియేటర్లలో ఈ యాక్షన్ విజువల్ ఫీస్ట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

అయితే, ఓటీటీ ఆడియన్స్‌ కోసం మేకర్స్ ఇక్కడ ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా కేవలం నార్మల్ వెర్షన్‌లా కాకుండా.. ‘Raw & Undekha’ (రా అండ్ ఉందేఖా) పేరుతో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో సెన్సార్ వల్ల కట్ అయిన కొన్ని పవర్‌ఫుల్ అండ్ బోల్డ్ సీన్స్, ఎక్స్‌క్లూజివ్ అదనపు ఫుటేజ్, కట్ చేయని 'రా' యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఈ వెర్షన్‌లో జోడించారు.దీంతో డిజిటల్ ఆడియన్స్‌లో హైప్ ఇప్పుడే స్కై-హై లెవెల్‌కి చేరిపోయింది. థియేటర్లలో చూసిన ఇంపాక్ట్ కంటే.. ఈ 'రా & అన్‌కట్' వెర్షన్ ఓటీటీలో మరింత రాకింగ్‌గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

రణ్‌వీర్ సింగ్ ఊరమాస్ పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్, ఆదిత్య ధర్ టేకింగ్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇలా అన్నీ కలిపి 'ధురంధర్'ను ఒక అల్టిమేట్ యాక్షన్ రైడ్‌గా మార్చేశాయి. మరి రూ.1,850 కోట్ల బాక్సాఫీస్ రాక్షసుడు ఓటీటీలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story