బాక్సాఫీస్ ఊచకోత

Dhurandhar 2: బాక్సాఫీస్ దగ్గర ఒక సునామీ వస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు 'ధురంధర్ 2' చూపిస్తోంది. రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్, మొదటి రోజే రికార్డులన్నింటినీ తిరగరాస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవినీ ఎరుగని ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ షేక్ అయిపోతోంది!

ముందుగా పెయిడ్ ప్రీమియర్స్ విషయానికి వస్తే.. బుధవారం సాయంత్రం నుంచే ఈ సినిమా తన ప్రతాపం చూపించింది. కేవలం ప్రీమియర్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ 75కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో 'స్ట్రీ 2', పవన్ కళ్యాణ్ 'ఓజీ' పేరిట ఉన్న ప్రీమియర్ రికార్డులను ఇది సునాయాసంగా తుడిచిపెట్టేసింది.

ఇక మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి. 'ధురంధర్ 2' తొలిరోజే ఇండియాలో రూ. 146 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి, బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.200కోట్ల నుంచి రూ. 250 కోట్ల మార్కును తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఒక్కటే మొదటి రోజు రూ 2కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. హిందీ బెల్ట్‌లో అయితే రణవీర్ సింగ్ మేనియా మామూలుగా లేదు. షారుఖ్ ఖాన్ 'జవాన్', ప్రభాస్ 'సలార్' రికార్డులను కూడా ఈ సినిమా సవాల్ చేస్తోంది.

దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్, రణవీర్ ఎనర్జీ, దానికి తోడు సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి స్టార్ కాస్టింగ్ తోడవ్వడంతో థియేటర్ల దగ్గర జాతర కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ , క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌ను స్టన్ చేస్తున్నాయి.రూ,.280 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, మొదటి వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story