ధురందర్ -2 బాక్సాఫీస్ ఊచకోత

'Dhurandhar 2: The Revenge' Movie: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2: ది రివెంజ్' (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద నిజంగానే సునామీ సృష్టిస్తోంది.ఈ సినిమా విడుదలకు ముందే రూ.130 కోట్ల మార్కును దాటేసి రికార్డులు తిరగరాస్తోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం అడ్వాన్స్ బుకింగ్స్,పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఈ వసూళ్లు వచ్చాయి.పెయిడ్ ప్రివ్యూలు సుమారు రూ.40.54 కోట్లు, తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ (ఇండియా)లో రూ 29 కోట్లు.

ఓవర్సీస్ (విదేశాల్లో) రూ60 కోట్లకు పైగా వసూళ్లు మొత్తం విడుదలకు ముందే దాదాపు రూ.130.54 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, భారతీయ సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దిశగా దూసుకుపోతోంది.

ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ కాకుండా, కేవలం నాన్-థియేట్రికల్ రైట్స్ (ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్) ద్వారానే ఈ చిత్రం ఇప్పటికే రూ.245 కోట్ల లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను జియోహాట్‌స్టార్ (JioHotstar) భారీ ధరకు దక్కించుకుంది. రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story