‘Dhurandhar 2’: రెండో వారంలోనూ తగ్గని జోరు: ధురంధర్ 2 బాక్సాఫీస్ రిపోర్ట్
ధురంధర్ 2 బాక్సాఫీస్ రిపోర్ట్

‘Dhurandhar 2’: ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ' ధురందర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. తొలి వారం వసూళ్ల సునామీ తర్వాత, వర్కింగ్ డేస్‌లోనూ ఈ చిత్రం స్టడీగా కొనసాగింది. 8వ రోజు శుక్రవారం నుంచి మొదలైన రెండో వారాంతం (సెకండ్ వీకెండ్) జోరు అద్భుతంగా ఉంది. 9వ రోజు శనివారం మార్నింగ్ షోల నుంచే థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా మాస్ సెంటర్లలోనూ, మల్టీప్లెక్స్‌లలోనూ 'ధురంధర్ 2' సునామీ సృష్టిస్తోంది. 9వ రోజు ముగిసేసరికి ఈ చిత్రం715.72 కోట్ల భారీ నెట్ వసూళ్లను సాధించగా.. రూ. 854.99 కోట్ల గ్రాస్‌కు చేరింది. భారతదేశంలో రూ. 1,000 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దూసుకుపోతోంది. ధురందర్ 2 ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ. 1,000 కోట్ల క్లబ్‌లో అత్యంత వేగంగా ప్రవేశించిన బాలీవుడ్ చిత్రంగా నిలిచింది
నైజాం, సీడెడ్ ఏరియాల్లో ఈ చిత్రం ఆల్-టైమ్ రికార్డుల దిశగా పయనిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'ధురంధర్ 2' మ్యాజిక్ రిపీట్ అవుతోంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ 9 రోజుల్లో సాధించిన మొత్తం గ్రాస్ చూస్తుంటే, అతి త్వరలోనే ఈ చిత్రం 'బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్' క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భారీగా థియేటర్లకు తరలివస్తుండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.మరి 10వ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో, ఈ చిత్రం మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. ధురంధర్ హవా ఎక్కడితో ఆగుతుందో వేచి చూడాలి.

