Dhurandhar 2: దుమ్మురేపుతోన్న ధురంధర్ 2
ధురంధర్ 2

Dhurandhar 2: రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్: ది రివేంజ్’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇండియన్ సినిమాలో అతి తక్కువ టైమ్‌లో ఈ స్థాయిలో వసూళ్లు చేసిన మూడో చిత్రంగా ఇది నిలిచింది. బాహుబలి2, పుష్ప2 తర్వాత మూడు రోజుల్లో రూ.500 కోట్లు రాబట్టిన చిత్రమిది. ఈ మూడూ సీక్వెల్స్ కావడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైన ‘ధురంధర్ 2’ పాజిటివ్ టాక్‌తో వీకెండ్‌లో మరిన్ని వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రంపై బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొదటి పార్ట్ రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, సెకండ్ పార్ట్‌కు మరింత క్రేజ్ రావడంతో ఆ రికార్డును అతి తక్కువ రోజుల్లోనే అధిగమించేలా కనిపిస్తోంది.

