ఎపుడంటే.?

Dhurandhar Arrives on OTT: బాలీవుడ్ సెన్సేషన్ రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) ఓటీటీ విడుదల సోషల్ మీడియాలో,సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ధురంధర్’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.ఈ సినిమా 2026, జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. సాధారణంగా బాలీవుడ్ పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. ఆ నిబంధన ప్రకారమే జనవరి ఆఖరులో ఇది అందుబాటులోకి రావచ్చు.

డిసెంబర్ 5, 2025న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి భారీ స్టార్ కాస్ట్ ఇందులో నటించారు. ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం వంటి ప్రధాన దక్షిణాది భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్ లేదా చిత్ర నిర్మాణ సంస్థ (జియో స్టూడియోస్) నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story