Dhurandhar Enters the ₹1000 Crore Club: 1000 కోట్ల క్లబ్లో దురంధర్.. బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ సరికొత్త రికార్డ్
బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ సరికొత్త రికార్డ్

Dhurandhar Enters the ₹1000 Crore Club: డిసెంబర్ 5న విడుదలైన దురంధర్, తొలి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 24 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి 2025లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కేవలం ఇండియాలోనే రూ.700 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. గతంలో ఏ హిందీ సినిమాకు సాధ్యం కాని ఈ అరుదైన మైలురాయిని దురంధర్ అధిగమించడం విశేషం. క్రిస్మస్ సెలవులు ఈ సినిమా కలెక్షన్లకు మరింత బలాన్ని ఇచ్చాయి.
ప్రస్తుతం భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో దురంధర్ 7వ స్థానానికి చేరుకుంది. కల్కి 2898 AD, పఠాన్ వంటి భారీ చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్లను ఇది ఇప్పటికే దాటేసింది. ఇదే ఊపు కొనసాగితే షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డును కూడా త్వరలోనే అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కరాచీలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించే ఒక సీక్రెట్ ఏజెంట్ కథగా ఇది రూపొందింది. ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి టాప్ స్టార్స్ తమ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆదిత్య ధార్ దర్శకత్వ ప్రతిభ, యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి.
థియేటర్లలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా జనవరి 30, 2026న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ దురంధర్ 2 వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించి అంచనాలను పెంచేసింది.

