‘Dhurandhar’: బాక్సాఫీస్ వద్ద ధురంధర్ రికార్డుల వేట.. 11 రోజుల్లోనే రూ. 1,363 కోట్లు..
11 రోజుల్లోనే రూ. 1,363 కోట్లు..

‘Dhurandhar’: మెగా పవర్ ప్యాక్డ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం 11 రోజుల్లోనే అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేసింది. తన మొదటి భాగం సాధించిన లైఫ్‌టైమ్ కలెక్షన్లను అతి తక్కువ సమయంలోనే అధిగమించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
రికార్డుల లెక్కలివే:
మొదటి భాగం రికార్డు బ్రేక్:
నాలుగు నెలల క్రితం విడుదలైన ధురంధర్ మొదటి భాగం మొత్తం రన్ లో రూ.1,307.35 కోట్లు వసూలు చేయగా, ఈ సీక్వెల్ కేవలం 11 రోజుల్లోనే రూ. 1,363.15 కోట్ల గ్రాస్‌ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇందులో భారతదేశం నుండి రూ. 1,013.15 కోట్లు వసూలు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుండి రూ. 350 కోట్లు వచ్చాయి. ఈ భారీ వసూళ్లతో భారత సినీ చరిత్రలో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.
ఈ చిత్రంలో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్‌గా తన విశ్వరూపాన్ని చూపించారు. 26/11 దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని అండర్ వరల్డ్‌లోకి ప్రవేశించి శత్రువులను తుదముట్టించే భారత గూఢచారి కథ ఇది. రణవీర్ తో పాటు సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటించడం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.
ముందున్నది రాజమార్గమే..
ప్రస్తుతానికి బాలీవుడ్‌లో ఈ చిత్రానికి పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ధురంధర్ 2 వసూళ్ల ప్రభంజనం మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

