యాంకర్ క్వశ్చన్‌పై సింగర్ హేమచంద్ర ఫైర్

Singer Hemachandra Fires: టాలీవుడ్ ప్రముఖ గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులపై కొంతకాలంగా మీడియాలో వస్తున్న ఊహాగానాలకు హేమచంద్ర తొలిసారిగా ఘాటుగా స్పందించారు. ఓ తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా ప్రశ్నించే శైలిపై అసహనం వ్యక్తం చేశారు. హేమచంద్ర-శ్రావణ భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే మూడేళ్ల క్రితమే కొన్ని మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోయారని, కానీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారంపై స్పందించాల్సిందిగా కోరగా, హేమచంద్ర తీవ్రంగా స్పందించారు.

నా పని గురించి అడగండి!

విడాకుల గురించి అడిగిన యాంకర్‌ను ఉద్దేశిస్తూ, హేమచంద్ర ఇలా అన్నారు.."విడాకుల వార్త నిజమా? కాదా? అనేది పక్కనపెట్టండి. ఆ విషయం తెలుసుకోవడం వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏంటి? అని నేను అడుగుతున్నాను" అంటూ తిరిగి ప్రశ్నించారు. తాను కేవలం ఒక సింగర్‌గా మాత్రమే అందరికీ తెలుసని, తన వృత్తి గురించి, పని గురించి మాట్లాడాల్సిందిగా సూచించారు. "నేను నా గురించి వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోను. నా మాటల వల్ల ఒక్కరైనా స్ఫూర్తి పొందాలి కానీ పనికిమాలిన విషయాలకు సమయం వృథా చేయను" అంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మీకు ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తే జవాబిస్తాను

వ్యక్తిగత విషయాలపై ఇతరులు చూపుతున్న అతి ఆసక్తిని తప్పుబడుతూ.. హేమచంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు దానికి కారణం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు."నిజంగా ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే ఒక క్యూ అండ్ ఏ సెషన్ ఏర్పాటు చేద్దాం. ఈ విషయం మీకు ఎందుకు ఉపయోగపడుతుంది?' అని మీరు నాకు చెప్తే, ఆ సమాధానం నాకు నచ్చితే అప్పుడు నేను జవాబిస్తాను," అని ఆయన సవాల్ విసిరారు. పక్కవాళ్ల జీవితాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎందుకు? నా గురించి అంతగా తెలుసుకోవాలనుకుంటే నాకు సమయం దొరికే వరకు ఆగండి’’ అని తేల్చి చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story