ఎట్టకేలకు నోరు విప్పిన క్రిష్

Director Krish : డైరెక్టర్ క్రిష్ హరిహర వీరమల్లు సినిమా, పవన్ తో విభేదాలపై ఎట్టకేలకు మౌనం వీడారు. సినిమా నుంచి తప్పుకున్న క్రిష్ సినిమా రిలీజ్ సందర్భంగా భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. పవన్ గురించి, హరిహరవీరమల్లు గురించి క్లారిటీ ఇచ్చారు.

క్రిష్ తన ట్వీట్‌లో ఈ సినిమా తనకెంత ప్రత్యేకమో వివరించారు."ఇప్పుడు... హరిహర వీరమల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాదు.. ఒక బలమైన ఆశయంతో, ప్రతి ఫ్రేమ్ వెనుక చరిత్ర, అంకితభావంతో.ఈ ప్రయాణం ఇద్దరు గొప్ప దిగ్గజాల ద్వారా సాధ్యమైంది. కేవలం సినిమాలోనే కాదు, స్ఫూర్తిలోనూ.. మన పవన్ కళ్యాణ్ గొప్ప శక్తితో ఆశీర్వదించబడిన ఒక అసాధారణ శక్తి. ఆయనలో ఏ కెమెరా పూర్తిగా గ్రహించలేని ఒక అగ్ని ఉంది. ఆయన నిత్యం రగిలే అగ్ని కణం. అదే హరిహర వీరమల్లుకి ప్రాణం పోసింది. ఆయనే సినిమాకు వెన్నెముక, ఆత్మ. నిర్మాత ఏ.ఎం. రత్నం ఒక గొప్ప శిల్పి. ఎన్ని కఠిన పరిస్థితులను అయినా తట్టుకోగల ధైర్యం ఉన్న వ్యక్తి. ఆయన గొప్ప సంకల్పం అందరికీ స్ఫూర్తిని ఇచ్చిందని ట్వీట్ చేశారు.

నిన్న శిల్పకళా వేదికలో జరిగిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో క్రిష్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. క్రిష్ విజన్‌కు, సినిమా పట్ల ఆయన నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం క్రిష్ ఎంత కష్టపడ్డారని చెప్పారు. ఇద్దరి మధ్య విభేదాలున్నాయనే పుకార్లకు వీరి కామెంట్స్ త ఫుల్ స్టాప్ పడినట్లే అనుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story