ఆది, సాయికుమార్ తో తీయాలి

Dil Raju: ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన 'శంబాల' (Shambhala) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన 'థ్యాంక్స్ మీట్' (Success Meet) కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ఈవెంట్ చివరలో చిత్ర యూనిట్ సభ్యులకు దిల్ రాజు స్వయంగా మెమెంటోలను అందజేసి వారిని అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజ్.. "నిజంగా 'బొమ్మరిల్లు-2' తీయాలంటే అది ఆది సాయికుమార్, ఆయన తండ్రి సాయికుమార్ గారితోనే తీయాలి" అని అన్నారు.. కొడుకు సక్సెస్ కోసం సాయికుమార్ పడే తపనను చూస్తుంటే ముచ్చటేస్తుందని, ఈ చిత్ర విజయంలో ఆయన ఒక బ్యాక్‌బోన్‌లా నిలిచారని ప్రశంసించారు.'శంబాల' చిత్ర ప్రోమో చూసినప్పుడే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని తాను చిత్ర బృందానికి చెప్పానని, ఆ నమ్మకం ఇప్పుడు నిజమైందన్నారు. క్రిస్మస్ రేసులో ఐదు సినిమాలు విడుదలైనప్పటికీ, 'శంబాల' 100% సక్సెస్ సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించిందన్నారు.

దర్శకుడు యుగంధర్ ముని మేకింగ్‌ను, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ గారల అభిరుచిని దిల్ రాజు అభినందించారు. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన శంబాల డిసెంబర్ 25, 2025న విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ చిత్రం జనవరి 9న హిందీలో కూడా విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story