పుకార్లపై డైరెక్టర్ రియాక్షన్!

Director Anil Ravipudi: చిరంజీవి గారితో 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి భారీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తారని ఇప్పటికే ఖరారైంది. అయితే, ఇది మల్టీస్టారర్ సినిమా అని, ఇందులో రెండో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

మొదట మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే తమిళ హీరో కార్తీ ఆ ప్లేస్‌లోకి వచ్చారని మరో ప్రచారం మొదలైంది. ఇలా రోజుకో పేరు వినిపిస్తుండటంతో అనిల్ రావిపూడి ఈ పుకార్లకు చెక్ పెట్టారు. సోషల్ మీడియాలో వస్తున్న అనధికారిక వార్తలను నమ్మవద్దని ఆయన అభిమానులను, మీడియాను కోరారు. తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ అయినా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే తెలియజేస్తానని స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌లో ఫహద్ ఫాసిల్ కానీ, కార్తీ కానీ ఉండకపోవచ్చని, టీమ్ ఇతర ఆప్షన్లను పరిశీలిస్తోందని తెలుస్తోంది. స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాతే ఈ మల్టీస్టారర్ హీరో ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story