సినిమా యూఫోరియా

Director Gunasekhar: వైజాగ్‌లో జరిగిన యుఫోరియా సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో దర్శకుడు గుణశేఖర్ చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. యుఫోరియా" కేవలం యువతకు మాత్రమే కాదు, ప్రతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తప్పక చూడాల్సిన సినిమా అని ఆయన అన్నారు. నేటి తరం ఎదుర్కొంటున్న సవాళ్లు, టీనేజ్ వయసులో పిల్లలు తీసుకునే నిర్ణయాలు వారి జీవితాలను ఎలా మారుస్తాయనేది ఇందులో వాస్తవికంగా చూపించామని తెలిపారు.

ఈ సినిమా ప్రధానంగా మత్తు పదార్థాలు (Drugs), నేరాలు , పోక్సో (POCSO) చట్టం చుట్టూ తిరుగుతుందని ఆయన వెల్లడించారు. సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల యువతకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశమన్నారు.

సుమారు 6 నెలల పాటు ఆడిషన్స్ నిర్వహించి 20 మంది కొత్త నటీనటులను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నటి భూమిక పోషించిన 'వింధ్య' పాత్ర, సారా అర్జున్ నటన సినిమాకు హైలైట్ అని ఆయన ప్రశంసించారు.వైజాగ్ తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశమని, ఇక్కడి ప్రజల నుంచి వచ్చే స్పందన ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story