Director Steps Away from Rajinikanth–Kamal Film: రజినీ,కమల్ సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్
సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్

Director Steps Away from Rajinikanth–Kamal Film: రజినీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతున్న 'తలైవర్ 173' (వర్కింగ్ టైటిల్) అనే సినిమా నుంచి దర్శకుడు సుందర్ సి తప్పుకున్నారు. ఈ సినిమా కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించబడుతోంది.
సుందర్ సి ఈ సినిమాకు దర్శకుడిగా వారం రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించబడ్డారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరుణాచలం' (1997) బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ కాంబోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుందర్ సి స్వయంగా ఒక లేఖ విడుదల చేస్తూ, "అనుకోని,అనివార్య కారణాల వల్ల" ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇది తన కలల ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. ఇద్దరు హీరోల తనకెంతో ముఖ్యమైన వ్యక్తులని, వారితో కలిసి పనిచేయలేకపోతున్నందుకు బాధపడుతున్నానంటూ ఆయన తెలియజేశారు. సుందర్ సి తప్పుకోవడంతో, 'తలైవర్ 173'కి కొత్త దర్శకుడు ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు (పేట డైరెక్టర్) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

