Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు వందల కోట్ల ఆస్తులు..నిజమేనా.?
నిజమేనా.?

Asha Bhosle: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన గొంతుతో దశాబ్దాల పాటు అలరించిన ధృవతార ఆశా భోస్లే. వేల పాటలు, వందలాది అవార్డులు మాత్రమే కాదు.. ఆశా తనకంటూ ఒక భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని కూడా నిర్మించుకున్నారు. ఒక సామాన్య నేపథ్యం నుంచి వచ్చి నేడు ఆమె సంపాదించిన ఆస్తుల విలువ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే!"
ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఆశా భోస్లే గారి నికర ఆస్తుల విలువ సుమారు రూ.200 నుండి250 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కేవలం సినిమాల్లో పాడటమే కాకుండా.. ఆమె పాడిన వేలాది పాటలపై వచ్చే రాయల్టీలు ఆమెకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆమె చేసే గ్లోబల్ కాన్సర్ట్‌లు, స్టేజ్ పర్ఫార్మెన్స్‌లకు ఇప్పటికీ విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక్కో షో కోసం ఆమె భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటారు.
అయితే ఆశా కేవలం సింగర్ మాత్రమే కాదు.. ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్ కూడా! 'Asha’s' (ఆశాస్) పేరుతో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో రెస్టారెంట్ బిజినెస్ ఉంది. దుబాయ్, యూకే వంటి దేశాల్లో ఈ రెస్టారెంట్లు రుచికరమైన భారతీయ వంటకాలను అందిస్తూ భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. సంగీతం పట్ల ఎంతటి మక్కువ ఉందో.. వంట పట్ల, వ్యాపారం పట్ల ఆమెకు ఉన్న విజన్ అంతటిదని ఈ రెస్టారెంట్ల విజయం చెబుతోంది.
ఇక ఆస్తుల విషయానికి వస్తే.. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆమెకు ఒక లగ్జరీ ఫ్లాట్ ఉంది. వీటితో పాటు ఆమెకు వివిధ ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల విలువ సుమారు రూ. 80 నుండి 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఎనిమిది దశాబ్దాల కఠోర శ్రమ, అంకితభావం ఆమెను ఈ స్థాయికి చేర్చాయి.

