ఎన్ని కోట్లో తెలుసా?

Net Worth of Anushka Shetty: టాలీవుడ్ జేజమ్మగా, లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి. గడిచిన రెండుదశాబ్దాలు గా వెండి తెరపై తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ మూవీతో సినీరంగప్రవేశం చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది.
తాజా సమాచారం ప్రకారం ఆమె నిరక ఆస్తుల విలువ సుమారు రూ.133 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సినిమాలు తగ్గించినప్ప టికీ నెలకు సుమారు కోటి రూపాయల వరకు ఆదాయం గడిస్తుందట. కెరీర్ అ రం భం లో సాధారణ రె మ్యునరేషన్ తీసుకున్న ఈ నటి రేంజ్ అరుంధతి తర్వాత ఒక్క సారిగా మారిపోయింది. ప్రస్తుతం స్వీటీ ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది. బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారా ఏటా సుమారు రూ.12 కోట్ల వరకు పొందుతుంది. అనుష్కకు తన కుటుంబం నుంచి కూడా గణనీయమైన ఆస్తులు సంక్రమించాయి. సినిమాల విషయానికొస్తే... ఘాటి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీని తర్వాత మలయాళ ఇండస్ట్రీలో ఒక సినిమాకు సంతకం చేసింది.

