డాక్యుమెంటరీ

Documentary on Konda Laxman Bapuji: కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితంపై నిర్మిస్తోన్న డాక్యుమెంటరీ చిత్రం "యూనిటీ" ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంటరీకి "యూనిటీ: ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్" (Unity: The Man of Social Justice) అనే పేరు పెట్టారు.సెప్టెంబర్ 27, 2025న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఈ డాక్యుమెంటరీని విడుదల చేశారు. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, రచయిత మసన చెన్నప్పతో కలిసి ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు.

డాక్యుమెంటరీలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జీవిత ప్రయాణం, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర, అలాగే నిజాం పాలన, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన కృషిని వివరంగా చూపించనున్నారు. బడుగు విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి చిరందాసు ధనుంజయ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఈ డాక్యుమెంటరీని ప్రజలందరూ ఉచితంగా చూసేలా యూట్యూబ్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలంగాణ ధ్వజస్తంభాలను భావి తరాలకు గుర్తు చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.

ఈ డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, బాపూజీ జీవన ప్రవాహాన్ని ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించిన దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు. యువ తరానికి ఆయన జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story