మళ్లీ..

Don' Franchise: షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన 'డాన్' ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు సినిమాలు రాగా.. ఇప్పుడు మూడో సినిమా సెట్ కు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈసారి రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. గత కొన్నినెలలుగా దర్శకుడు పరాన్ అక్తర్ ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నాడు. నిజానికి గత ఏడాదే ఈ సినిమా సెటసక్కు వెళ్లాల్సి ఉంది. కానీ షారుఖ్ స్థానంలో రణవీర్ ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. ఆవిమర్శల వేడి చల్లారడంతో పాటు డాన్ క్యారెక్టర్ కోసం ఫిజికల్ గా రణవీర్ ప్రిపేర్ అయ్యేందుకు టైమ్ తీసుకున్నారు.
హీరోయిన్ గా కియారా అద్వానిని ఎంపిక చేయగా.. తన ప్రెగ్నెన్సీ కారణంగా కుదరలేదు. తిరిగి ఇప్పుడు ఆమెనే హీరోయిన్ గా నటించబోతోంది. ఇక అభిమానులను సంతృప్తిపరిచేందుకు షారుఖ్ ఖాన్ తో ఓ అతిథి పాత్ర చేయించాలనే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు. అంతేకాదు గతరెండు డాన్ చిత్రాల్లో స్పెషల్ ఏజెంట్ రోమాగా నటించిన ప్రియాంకను కూడా ఈ సినిమాలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నిజమైతే పదిహేనేళ్ల తర్వాత మళ్లీ షారుఖ్ తో కలిసి కనిపించబోతోంది ప్రియాంక. మొత్తానికి అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది జనవరి నుంచి 'డాన్ 3'షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
