ఫ్యాన్స్‌కు రిషబ్ శెట్టి రిక్వెస్ట్

Rishab Shetty's Request to Fans: కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతార చాప్టర్ 1 చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో రిషబ్ శెట్టి తన అభిమానులకు ఒక ముఖ్యమైన, ఆధ్యాత్మిక విజ్ఞప్తి చేశారు. అదేంటంటే దైవ వేషధారణలో థియేటర్లకు రావద్దని ఆయన కోరారు.

దైవ వేషధారణ పవిత్రం: రిషబ్ శెట్టి

కాంతార సినిమా చూసేందుకు కొందరు ఉత్సాహవంతులైన అభిమానులు, చిత్రంలోని దైవం (దైవ నర్తకులు) తరహా వేషధారణతో థియేటర్లకు వస్తున్న విషయం రిషబ్ శెట్టి దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన వెంటనే స్పందించారు. దైవ వేషధారణ అనేది తమ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదని దానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని ఆయన గుర్తుచేశారు.

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ...

‘‘దైవ వేషధారణ మన సంప్రదాయంలో చాలా పవిత్రమైన అంశం. దానికి సంబంధించిన భక్తిని, ఆధ్యాత్మికతను మనమందరం గౌరవించాలి. సినిమా థియేటర్లకు దైవ వేషాలతో రావడం ఆ సంప్రదాయాన్ని వక్రీకరించినట్లు అవుతుంది. దయచేసి అలాంటి పనులు చేయకండి. మనం ఆ పుణ్యాన్ని, పవిత్రతను కాపాడుకోవాలి’’ అని అభిమానులను అభ్యర్థించారు.

అభిమానుల మద్దతు

కాంతార సినిమా కథ కూడా సంప్రదాయాలు, నమ్మకాల చుట్టూనే తిరుగుతుందని, కాబట్టి అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తన విజ్ఞప్తిని గౌరవించాలని రిషబ్ శెట్టి కోరారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన అభిప్రాయాన్ని పలువురు అభిమానులు, నెటిజన్లు సమర్థిస్తూ సంప్రదాయాన్ని గౌరవించాలన్న ఆయన ఆలోచనను ప్రశంసిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story