డ్రగ్‌‌ కేసు కొట్టివేత

Navdeep: సినీ నటుడు నవదీప్‌‌‌‌పై నమోదైన డ్రగ్స్‌‌‌‌ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టివేయాలని కోరుతూ నవదీప్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ జె.శ్రీనివాసరావు విచారణ చేపట్టగా, పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది వెంకట సిద్ధార్థ వాదనలు వినిపించారు. ఫిర్యాదుతో పాటు కోర్టులో దాఖలైన అభియోగ పత్రంలో, ఇతర సాక్షుల వాంగ్మూలాల్లో ఎక్కడా పిటిషనర్‌‌‌‌ పేరు లేదన్నారు. ఏపీపీ జితేందర్‌‌‌‌రావు వాదనలు వినిపిస్తూ.. ఆరోపణలకు ఆధారాలున్నాయని, వీటిని కింది కోర్టులో తేల్చుకోవాలన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి డ్రగ్స్‌‌‌‌ కేసుకు సంబంధించి కింది కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో 29వ నిందితుడిగా నవదీప్‌‌‌‌ పేర్కొనడం తప్ప.. మరెక్కడా ఆయన ప్రస్తావన లేదన్నారు. పిటిషనర్‌‌‌‌ నుంచి నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఆధారాల్లేవంటూ కేసును కొట్టివేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story