Dude.. ‘Telusu Kada’ : డ్యూడ్..తెలుసు కదా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే.?
కలెక్షన్లు ఎన్ని కోట్లంటే.?

Dude.. ‘Telusu Kada’ : నిన్న ఒకే రోజు విడుదలైన మూవీలు డ్యూడ్, తెలుసు కదా షాకింగ్ కలెక్షన్లు రాబట్టాయి. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'డ్యూడ్' సినిమా తొలిరోజు మంచి వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 15 - నుంచి రూ.16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఇండియా నెట్ కలెక్షన్లు రూ. 10 కోట్లుగా నమోదైంది. తెలుగు వెర్షన్ తొలి రోజు దాదాపు రూ. 3.25 కోట్లు నెట్ కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, దీపావళి సీజన్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'తెలుసు కదా' సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్లు (తొలి రోజు): దాదాపు రూ. 2 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే విడుదల కావడం .. అదే రోజు విడుదలైన ఇతర సినిమాలతో పోటీ కారణంగా వసూళ్లు నెమ్మదిగా మొదలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
