Durandhar Creating a Storm: కలెక్షన్లలో దుమ్ము లేపుతోన్న దురంధర్
దుమ్ము లేపుతోన్న దురంధర్

Durandhar Creating a Storm: రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై థ్రిల్లర్ 'దురంధర్' (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఈ సినిమా విడుదలైన 18 రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటబోతోంది. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
16వ రోజు కలెక్షన్ల విషయంలో 'బాహుబలి 2' పేరిట ఉన్న రికార్డును ఈ సినిమా అధిగమించింది.ప్రభాస్ 'బాహుబలి 2' మూవీ సుమారు రూ. 36 కోట్లతో అగ్రస్థానంలో ఉండేది. అయితే, 'ధురంధర్ 'తన 16వ రోజున ఏకంగా రూ. 39 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఆ రికార్డును తిరగరాసింది. పుష్ప 2 తర్వాత అతి తక్కువ రోజుల్లో (16 రోజులు) రూ.500 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది. హిందీ సినిమాల్లో 'జవాన్' రికార్డును ఇది బద్దలు కొట్టింది.
ఈ చిత్రం దాదాపు 3 గంటల 34 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇందులో అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, సంజయ్ దత్,అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రలు పోషించారు. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై నిషేధం ఉన్నప్పటికీ, మిగిలిన చోట్ల వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, ఈ సినిమా వెయ్యి కోట్ల మైలురాయిని చేరుకునే అవకాశం పుష్కలంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వసూళ్లు
భారత్ లో నెట్ సుమారు రూ. 579 కోట్లు.
భారత్ లో (గ్రాస్): సుమారు రూ. 689 కోట్లు.
ప్రపంచవ్యాప్తంగా (మొత్తం గ్రాస్ ): సుమారు రూ.877 -- రూ.900 కోట్లు.

