Salman Khan: నెలకు రూ.30 లక్షలు.. గేమర్ సంపాదన విని షాకైన సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్

Salman Khan: ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' హిందీ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో, ఎప్పటిలాగే పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా స్టార్స్ అడుగుపెట్టారు. అయితే, ఈ సీజన్ గ్రాండ్ లాంచ్ వేదికపై అందరి దృష్టినీ ఆకర్షించాడు ఒక యువ యూట్యూబర్. అతనే గేమింగ్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న 'స్కౌట్ అప్' ఫేమ్ తన్మయ్ సింగ్.
ఈశ్వర్ సాయి తరహాలోనే సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న తన్మయ్ సింగ్‌కు యూట్యూబ్‌లో ఏకంగా 50 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గేమ్స్ ఆడుతూ వ్లాగ్స్ చేయడం ఇతని ప్రత్యేకం. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చిన సమయంలో సల్మాన్ ఖాన్, తన్మయ్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ క్రమంలోనే, "అసలు గేమింగ్ వీడియోల ద్వారా నెలకు ఎంత సంపాదిస్తున్నావ్?" అని సల్మాన్ ప్రశ్నించారు.
అందరి ముందు చెప్పకుండా, తన్మయ్ తన నెలవారీ ఆదాయం ఎంతో సల్మాన్ ఖాన్ చెవిలో రహస్యంగా చెప్పాడు. అతడు చెప్పిన నంబర్ వినగానే సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు! ఆశ్చర్యపోతూ... "ఏంటి? నెలకు రూ. 30 లక్షలు సంపాదిస్తున్నావా!" అని బిగ్గరగా అన్నారు. దానికి తన్మయ్ స్పందిస్తూ... "అవును సర్, అదంతా వంద శాతం వైట్ మనీనే! ప్రతి రూపాయి నాకు బ్యాంక్ చెక్కుల రూపంలోనే వస్తుంది" అని చాలా ధీమాగా సమాధానమిచ్చాడు.
ఈ ఒక్క మాటతో బిగ్ బాస్ స్టేజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. కేవలం డిజిటల్ కంటెంట్, గేమింగ్ వీడియోలతో నెలకు రూ. 30 లక్షలు సంపాదించడం విన్న ప్రేక్షకులు, ఇతర కంటెస్టెంట్లు విస్మయానికి గురయ్యారు. చిన్న వయసులోనే యూట్యూబ్‌ని నమ్ముకుని ఈ స్థాయి ఆదాయాన్ని గడిస్తున్న తన్మయ్ సమర్థతను సల్మాన్ ఖాన్ ప్రశంసించారు.
ప్రస్తుతం ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గేమ్ ఆడటానికి ముందే తన సంపాదనతో అందరినీ షాక్‌కి గురిచేసిన తన్మయ్, మరి బిగ్ బాస్ హౌస్‌లో తన ఆటతీరుతో ఏ మేర ఆకట్టుకుంటాడో వేచి చూడాలి

