ఈషా రెబ్బా చెక్..

Actress Eesha Rebba: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా, దర్శకుడు తరుణ్ భాస్కర్ మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన “ఓం శాంతి శాంతి శాంతిహి” సినిమా ప్రమోషన్ల సమయంలో.. మీరు డేటింగ్‌లో ఉన్నారా అని అడిగిన ప్రశ్నలకు తరుణ్ భాస్కర్ త్వరలోనే ఒక "శుభవార్త" చెబుతానంటూ హింట్ ఇచ్చారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. 2026 జనవరిలో వీరి సినిమా విడుదలైనప్పటికీ, పెళ్లి విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మధ్యలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల ఉదయ్‌పూర్ పెళ్లికి కూడా ఈ జంట కలిసి వెళ్లడంతో అందరూ వీరు త్వరలోనే ఒక్కటవుతారని ఫిక్స్ అయిపోయారు. కానీ, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈషా, తరుణ్ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవద్దని, కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ "ఈ నగరానికి ఏమైంది 2" (ENE2) దర్శకత్వంలో బిజీగా ఉండగా, "గాయపడ్డ సింహం" అనే సినిమాలో నటుడిగానూ నటిస్తున్నారు. ఈషా రెబ్బా కూడా తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టింది.
ఇలాంటి సమయంలో ఈషా రెబ్బా గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తన పెంపుడు కుక్కతో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన ఈషా, తన జీవితంలో అసలైన ప్రేమ (Love of my life) ఇదేనంటూ క్యాప్షన్ ఇచ్చింది. తరుణ్ భాస్కర్‌తో పెళ్లి వార్తలపై వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ, ప్రస్తుతానికి తన ప్రాధాన్యతలేంటో ఆమె ఇలా సరదాగా చెప్పకనే చెప్పింది.

