Sneha Makes Sensational Remarks: ఎనిమిది నెలల నరకం.. నటి స్నేహ సంచలన వ్యాఖ్యలు..
నటి స్నేహ సంచలన వ్యాఖ్యలు..

Sneha Makes Sensational Remarks: తెలుగు, తమిళ భాషల్లో తనదైన నటనతో హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి స్నేహ, తన సినీ ప్రయాణంలో ఎదురైన ఒక భయంకరమైన ప్రమాదం గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ఒకానొక దశలో తన కెరీర్ ఇక ముగిసిపోయిందని, మళ్లీ కెమెరా ముందుకు రావడం అసాధ్యమని భావించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
జీవితాన్ని తలకిందులు చేసిన ప్రమాదం:
వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమయంలో జరిగిన ఒక ఘోర ప్రమాదం స్నేహ జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు, చేతులు, వీపు భాగానికి బలమైన గాయాలు కావడంతో ఆమె కదలలేని స్థితికి చేరుకున్నారు.
వైద్యుల హెచ్చరిక:
కనీసం మంచం మీద నుండి లేచి నిలబడాలన్నా కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఆ సమయంలో తను పడిన బాధను గుర్తు చేసుకుంటూ స్నేహ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక తాను మళ్లీ మేకప్ వేసుకోలేనేమోనని భయపడినట్లు తెలిపారు.
మలుపు తిప్పిన పార్థిబన్ కనవు:
అలాంటి కష్టకాలంలో దర్శకుడు కరు పళనియప్పన్ ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. స్నేహ కదల్లేని స్థితిలో ఉన్నారని తెలిసినా, పార్థిబన్ కనవు కథను ఆమెతోనే చేయాలని ఆయన పట్టుబట్టారు. దర్శకుడు చూపిన ఆ నమ్మకం స్నేహలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మొండి ధైర్యంతో ఆ గాయాల నుండి కోలుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఆ సినిమా ఆమె కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచి, ఆమెను మళ్లీ బిజీ హీరోయిన్‌ను చేసింది.

