Akhil: అక్కినేని అభిమానులు ఎన్నో ఏళ్లుగా.. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆ సుదినం రానే వచ్చింది. కింగ్ నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, సరైన సాలిడ్ హిట్ కోసం ఇన్నాళ్లూ నిరీక్షించిన అక్కినేని అఖిల్.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద లెనిన్ రూపంలో ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. అఖిల్ ఈజ్ బ్యాక్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.

ఈ సినిమాలో అఖిల్ నటన వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఊరమాస్ లుక్‌లో, రస్టిక్ యాక్షన్‌తో అఖిల్ అదరగొట్టేశారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్‌లు, మైండ్ బ్లోయింగ్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను సీట్లలోంచి లేచేలా చేస్తున్నాయి. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్‌తో, యాక్టింగ్‌తో కుర్రకారును కట్టిపడేసింది. మొత్తానికి అక్కినేని ఫ్యాన్స్ కల నెరవేరింది.. థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంది.

ఇక ఈ భారీ విజయం అందించిన ఆనందంలో.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'లెనిన్' చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. చిత్ర బృందం సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

అయితే ఈ వేడుకలో ఒక అద్భుతమైన, భావోద్వేగ సన్నివేశం అందరి హృదయాలను కదిలించింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తండ్రికి కొడుకు ఇచ్చిన ఈ గ్రాండ్ సక్సెస్ గిఫ్ట్ చూసి కింగ్ నాగార్జున ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా తన తండ్రి నాగార్జున పాదాలకు నమస్కరించిన అఖిల్.. ఆయన్ను గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. తండ్రీకొడుకుల ఆ గట్టి కౌగిలింత.. ఇన్నాళ్ల కష్టాన్ని, నిరీక్షణను మరిపించి, చూసే ప్రతి ఒక్కరి కళ్లల్లో ఆనంద బాష్పాలు తెప్పించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story