రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్

Renudesai Shares an Emotional Post: రేణు దేశాయ్ ఇటీవల హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో 26 ఏళ్ల తర్వాత ర్యాంప్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ర్యాంప్ వాక్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు, ఆమె వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడటం వలన, ఒక బరువైన వస్తువు వారి తలకు తగిలిందట. ఆ క్షణంలో తనకు కన్నీళ్లు వచ్చాయని, చాలా బాధ కలిగిందని తెలిపారు.షో సమయం కావడంతో, ఆ బాధను, నొప్పిని భరిస్తూనే ఆమె ర్యాంప్ వాక్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆమె కళ్ళు కొద్దిగా ఎర్రగా, నీటితో నిండి ఉండటానికి కారణం అదేనని వివరించారు.

షోలో గందరగోళం జరగకుండా ఉండటానికి తాను ప్రయత్నించానని, ఈ విషయాన్ని వ్యక్తిగత కారణాల కోసం పంచుకోవడం లేదని తెలిపారు. "కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎలాంటి బాధను అనుభవిస్తున్నాడో, తన పరిస్థితిని కొనసాగించడానికి ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలియదు. అందుకే తోటివారి పట్ల మరింత దయతో ఉండాలి" అని సందేశం ఇచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నటనలోకి తిరిగి వచ్చి, ఇటీవల ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో ర్యాంప్ వాక్ చేసిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

2023లో రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా హిట్ కాలేదు. అయినా ఆఫర్లు వచ్చినా రేణు నిరాకరించారు. తర్వాత రెండేళ్లకు రేణుదేశాయ్ ప్రస్తుతం '16 రోజుల పండగ' అనే తెలుగు సినిమాలో అత్త పాత్రలో నటిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story