'ENE Repeat': తెలుగు యువత గుండెల్లో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన "ఈ నగరానికి ఏమైంది" సినిమాకు మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ పార్ట్-2 చిత్రానికి "ENE రిపీట్" (ENE Repeat) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రేజీ గ్యాంగ్ మళ్లీ థియేటర్లలో రచ్చ చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరోసారి తన మార్క్ మేకింగ్‌తో ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్ చిత్రంలోని 'కన్యారాశి' గ్యాంగ్ అయిన విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, మరియు వెంకటేష్ కాకుమాను మళ్లీ రీయూనియన్ అయి ఆనాటి ఫ్రెండ్‌షిప్ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతున్నారు. కాగా, ఈ క్రేజీ గ్యాంగ్‌కు యంగ్ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి తోడవ్వడం విశేషం. ఆయన ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తూ సరికొత్త ఎనర్జీని తీసుకురానున్నారు. ఎస్ ఒరిజినల్స్ మరియు రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

"ఈ నగరానికి ఏమైంది" మొదటి భాగం విడుదలై విజయవంతంగా ఎనిమిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి మధుర జ్ఞాపకాలను, గోవా ముచ్చట్లను గుర్తు చేస్తూ మేకర్స్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఐకానిక్ 'ఫ్రెండ్‌షిప్ యాంథమ్' పాటతో సాగే ఈ ఫీల్-గుడ్ గ్లింప్స్ వీడియో ద్వారానే విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో నొస్టాల్జియాను నింపుతోంది.

నిజానికి 'ఈ నగరానికి ఏమైంది' సినిమా విడుదలైన కొత్తలో కంటే.. కాలక్రమేణా యూత్‌లో కల్ట్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ఇటీవల థియేటర్లలో రీ-రిలీజ్ చేసినప్పుడు కూడా హౌస్‌ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రేపిన దుమ్ము అంతా ఇంతా కాదు. అందువల్లనే ఇప్పుడు రాబోతున్న ఈ సీక్వెల్ "ENE రిపీట్" పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

మొదటి భాగం వైబ్‌ను ఏమాత్రం మిస్ కాకుండా డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ఒరిజినల్ చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీమ్‌నే ఈ సీక్వెల్‌కు కూడా తీసుకున్నారు. వివేక్ Sagar అదిరిపోయే మ్యూజిక్ అందిస్తుండగా.. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ చేస్తుండగా, రాజేష్ పెంటకోట మరియు సాలీ వైట్ ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు. రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో త్వరలోనే చిత్ర ప్రమోషన్లను మరింత వేగవంతం చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story