Actress Kalyani Priyadarshan: అందరూ ఫీమేల్ సూపర్ హీరో అంటున్నరు.. మాటల్లో చెప్పలేను
మాటల్లో చెప్పలేను

Actress Kalyani Priyadarshan: నటి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన 'కొత్త లోక చాప్టర్ 1 చంద్ర' (Kotha Lokah: Chapter 1 Chandra) సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఒక ఫాంటసీ థ్రిల్లర్, ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ 'చంద్ర' అనే సూపర్ పవర్స్ కలిగిన యువతి పాత్రలో నటించారు. ఇది భారతదేశంలో తొలి మహిళా సూపర్ హీరో సినిమాగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించగా, డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసి, కళ్యాణి ప్రియదర్శన్‌ను రూ. 200 కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ నటిగా నిలబెట్టింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది
ఈ సినిమా విజయం సాధించడంతో నటి కళ్యాణి ప్రియదర్శిని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా హిట్ తర్వాత అందరు తనను ఫీమేల్ సూపర్ హీరో అంటున్నారని.. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని తెలిపింది.ఇది టీం విజయమని చెప్పారు. కొత్త లోక' విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందా లేదా అనే విషయంపై చిత్ర బృందం అనుమానంగా ఉన్న సమయంలో, ఈ సినిమా నిర్మాత దుల్కర్ సల్మాన్ ఫోన్ చేసి భరోసా ఇచ్చారని ఆమె అన్నారు. "డబ్బులు పోయినా నాకు పర్వాలేదు, ఒక మంచి సినిమా తీశామన్న సంతోషం ఉంది. ప్రేక్షకులు ఎంత తక్కువ మంది అయినా, ఈ సినిమా సరైన ఆడియెన్స్‌ను కనుగొంటుంది" అని దుల్కర్ చెప్పారని ఆమె వెల్లడించారు. ఈ మాటలు తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయని ఆమె తెలిపారు.
తన నటనపై విమర్శలు ఎదురైనప్పటికీ, 'కొత్త లోక'లో తన పాత్రకు సరిపోయే నటనను ప్రదర్శించగలిగానని కళ్యాణి చెప్పారు. ఆమె తన పాత్ర కోసం చాలా శ్రమించారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, ఫాంటసీ థీమ్ కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
