భారతిగా భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ రిలీజ్

Exciting Update from Akhil & Lenin: అక్కినేని అఖిల్ హీరోగా, మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం లెనిన్. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా నటిస్తున్న కథానాయిక భాగ్యశ్రీ బోర్సే లుక్‌ను శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు.

హీరోయిన్ పరిచయం - ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రంలో భాగ్యశ్రీ పోషిస్తున్న భారతి అనే పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది. "లెనిన్ ప్రేమ.. భారతి" అంటూ విడుదల చేసిన పోస్టర్‌లో భాగ్యశ్రీ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను జనవరి 5న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ ప్రాజెక్ట్‌లో మొదట శ్రీలీల నటించాల్సి ఉండగా, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేని ఎంపిక చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి అక్కినేని నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌తో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని 2026 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నద్ధమవుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story