Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్ డేట్
క్రేజీ అప్ డేట్

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. హరీశ్ శంకర్ తెరకెక్కి స్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడాని కి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతు న్నాయి. తాజాగా డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ టీం సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. దీనిని ఈ ఏడాది మార్చి 26న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నా హాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తు న్నారు. ఇందలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ స్టైలిష్ కనిపించనున్నాడు.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్అందిస్తున్నా డు. 'ఈసారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది' అంటూ ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమా రేంజ్ను చెప్పకనే చెప్పగా, ఇప్పుడు డబ్బింగ్ పనులు మొదలవ్వడం సినిమా విడుదలకు అడుగులు వేగంగా పడుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది. ఇక 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్, హరీశ్ శంకర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవు తుండ టంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

